అక్రమ అరెస్టులను ఖండించిన సి.ఐ.టి.యు.

Published: Wednesday September 14, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 13, ప్రజాపాలన: అక్రమ అరెస్టులను ఖండించిన సి ఐ టి యు,
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్   ఆధ్వర్యంలో మంగళవారం రోజున జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు  చేశారు. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో గత కొన్ని రోజుల నుండి వీఆర్ఏ, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలు చేస్తున్నారని,ఈ రోజు చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్బంలో హైదరాబాద్ వెళ్తున్న జేఏసీ నాయకులను వీరికి మద్దతుగా సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులను, సిపిఎం జిల్లా కార్యదర్శిని ఇతర సంఘాల నాయకులను సోమవారం అర్ధరాత్రి నుంచి పోలీసుల అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.ఇలాంటి అరెస్టులతో ఉద్యమాలను ఆపాలేరని అన్నారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను అందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి , షకీల్, సాగర్, సోను తదితరులు పాల్గొన్నారు.