ఎల్లమ్మ ఆలయంలో ఆభరణాలు,నగదు చోరీ

Published: Monday August 22, 2022
కోరుట్ల, ఆగస్టు 21 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ బద్దలు కొట్టి నగదు అపహరించారు.
అమ్మ వారి బంగారు ముక్కు పుడక, పుస్తెలు ,
వెండి ఆభరణాలు చోరీ చేశారు.ఉదయం ఆలయ పూజారి వెళ్ళేసరికి ఆలయం యొక్క తలుపులు బద్దలు కొట్టి ,హుండీ తాళం తెరిచి వుండడం చూసి ఆలయ కమిటీ, గ్రామ సర్పంచ్ కు సమాచారం అందిచారు.సమాచారం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ సర్పంచ్ హుటాహుటిన ఆలయానికి చేరుకుని కోరుట్ల ఎస్ఐ కి సమాచారం అందిచారు. సుమారు అమ్మవారు ఆభరణాలు 90 వేల వరకు ఉంటుందని, హుండీ సుమారు ఐదు సంవత్సరాల నుండి లెక్కించకుండ వుందని తెలిపారు.వెంటనే దొంగలను పట్టుకొని చోరీ అయిన ఆభరణాలు, నగదును రికవరీ చేసి ఇవ్వాలని సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య కోరారు.