కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి:ఎంపీపీ రవీందర్ గౌడ్

Published: Thursday April 29, 2021

జిన్నారం, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండలంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ఎంపీపీ దమ్మగౌని రవీందర్ గౌడ్ సమక్షంలో వైస్ ఎంపీపీ గంగూ రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సోలాక్పల్లి సర్పంచ్ దాసరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో  కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ధర్నా చెప్పటారు, ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కోవిడ్-19 ను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని, తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందేనని, దీంతో కరోనా భారిన ప్రజలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు,ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడ సౌకర్యాలు ఉన్నా, కరోనా వ్యాధిసోకిన వారు ఎక్కువ శాతం ఉండడంతో ప్రవైటు ఆసుపత్రుల్లో చికిత్సపైనే మొగ్గుచూపుతున్నారు, దీంతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అధిక మొత్తంలో ఫీజుల వసూలు చేస్తున్నారని, కావాల్సిన మందులు సైతం బ్లాక్ మార్కెట్ ‌కు తరలడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చడం ద్వార ప్రవేట్‌లో కనీస చికిత్స అవకాశాలు ఉన్నాయని, దీంతో పాటు ప్రజలకు ఎలాంటీ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎంపీపీ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్ల ఉప సర్పంచ్ రవీందర్, మత్స్యకార సంఘం డైరెక్టర్ అండూరు సత్యనారాయణ, నరేందర్ గౌడ్, పుట్టి భాస్కర్, కంది ఎల్లయ్య, న్యాదారి ఈశ్వరయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు