*భారత్ జోడో యాత్ర విజయవంతం*

Published: Tuesday January 31, 2023

**ప్రజాపాలన షాబాద్ :ఏఐసిసి మాజీ అధ్యక్షులు,  శ్రీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "భారత్ జోడో యాత్ర" కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3532 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి  చేసుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు షాబాద్ మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేధిస్తున్న విధానాలను గాని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరంకుశ పాలనను గద్దె దించి రాబోయే ఎన్నికలలో కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఈ రాబందుల పాలనను సాగనంపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్థానిక షాబాద్ మండలంలో ప్రత్యేకమైనటువంటి పైల్వాన్ షావలి దర్గాలో శ్రీరామాలయంలో ప్రత్యేక పూజలు  చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో షాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావలి చంద్రశేఖర్  ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, వెంకట్ రెడ్డి,ఎల్గొండగూడ  సర్పంచ్  ఎల్గంటి  ప్రతాప్ రెడ్డి మాజీ సర్పంచులు ఆర్ శేఖర్, బుర్ర ఆంజనేయులు గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు తమ్మలి రవీందర్, ఎలుగంటి రాఘవరెడ్డి, బండ వెంకటరెడ్డి, నరెడ్లగూడెం జంగయ్య, నాయకులు రవీందర్ యాదవ్ ,పలుగుట్ట సత్యం, బేగరి శేఖర్ ,గౌరీశ్వర్, గౌతమ్, మల్లేష్, ఇక్బాల్, ఎండి బురాన్, దస్తగిర్, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ రెడ్డి ,కృష్ణ ,శ్రీనివాస్ ,ప్రవీణ్, చంద్రయ్య, యాదయ్య యు నోస్, రాజు, శివకుమార్ శ్రీనివాస చారీ తదితరులు పాల్గొన్నారు*