మన ఊరు మనబడి ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రేఖానాయక్

Published: Thursday February 02, 2023

జన్నారం, ఫిబ్రవరి 01, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ గ్రామంలో మన ఊరు మనబడి పథకంలో భాగంగా పోన్కల్ గ్రామంలో బుధవారం ప్రాథమిక పాఠశాల పునర్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర్ రేఖనాయక్ హాజరై ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఊరు మనబడి పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలకు మార్దశ వచ్చిందని, తెలంగాణలో ప్రతి పేద విద్యార్థులకు పాఠశాలలో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకే మన ఊరు మన బడి పథకమని అమె అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 12 రకాల వసతులతో పాఠశాలలు అందంగా రూపుదిద్దు కోన్నాయన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో మొదటిగా రెండు పాఠశాలలు మన ఊరు మనబడిలో పోన్కల్, చింతలపల్లి ప్ సిద్ధంగా ఉన్నాయన్నారు. అందులో భాగంగా పొన్కల్ ప్రాథమిక పాఠశాల 25 లక్షల వ్యయంతో పూర్తి చేయబడిన పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించారన్నారు. అనంతరం అదే గ్రామంలో ప్రభుత్వం నుండి పొందే దళిత బండు గురించి ఎమ్మెల్యే ఎస్సీ కాలనీలో అవగాహన కల్పించారు. దళిత బంధు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారికి తమ వంతుగా సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కరుణారాణి, ఎస్ఐ సతీష్, మండల టిఆర్ఎస్  అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, ఏఎంసి చైర్మన్ శ్రీపతి పద్మ, వైస్ చైర్మన్ గొట్ల రాజేష్ యాదవ్, ఎంపీపీ మాదాడి సరోజన, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్, ఫోన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, ఉపసర్పంచ్ శ్రీనివాసగౌడ్, ఎంఈఓ విజయ్ కుమార్, కట్ట రాజమౌళి, పోన్కల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాజాల శ్రీనివాస్,  ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు, మండల ప్రజా ప్రతినిధులు, పోన్కల్ గ్రామ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.