బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ

Published: Tuesday May 31, 2022
కార్యక్రమం మధిర రూరల్ మే 31 ప్రజా పాలన ప్రతినిధిమధిర మండల పరిధిలోని  మంగళవారం నాడుబుచ్చిరెడ్డిపాలెం* గ్రామంలో  టిపిసిసి అధ్యక్షులు *రేవంత్ రెడ్డి*.  తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ *శ్రీ మల్లు భట్టి విక్రమార్క * ఆదేశానుసారం  రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు *సూరం శెట్టి కిషోర్* మాట్లాడుతూ  ఏఐసిసి ఉపాధ్యక్షులు *శ్రీ రాహుల్ గాంధీ  * వరంగల్ బహిరంగసభలోవ్యవసాయ రైతులకు  ఉపాధి హామీ కూలీలకు భూమి లేని కౌలు రైతులకు  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పడితే చేయబోయే కార్యక్రమాలను సభలో తెలపడం జరిగింది వాటిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెలో మరియు ప్రతి ఇంటికి  తెలిసేవిధంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని .మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ముపై రోజులలో   రైతులకు రెండు లక్షల  రూపాయల రుణమాఫీ చేస్తామని అన్నారు. అలాగే రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర  కల్పిస్తామన్నారు .* 
*ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామన్నారు* .
*నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం పసుపు బోర్డ్ ను ఏర్పాటు చేస్తాం.*భూమి ఉన్న ప్రతి రైతుకు  వారితో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు. 15000 .అందిస్తాం.*భూమీ లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12000 ఇవ్వడం జరుగుతుంది నకలి విత్తనాలు .పురుగు మందులు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.* 
*పొడు భూముల రైతులకు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ .విక్రయలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కలిపిస్తాం.*  అని వారు తెలిపినారుఈ కార్యక్రమంలో  మధిరమండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు  *దారా బాలరాజు* కిసాన్ సెల్ మండల అధ్యక్షులు *దుంప వెంకటేశ్వర్ రెడ్డి*.  గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  *దేవి శెట్టి సురేష్*, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి *సంపశాల రామకృష్ణ*. మండల బీసీ సెల్ అధ్యక్షులు *చిలువేరు బుచ్చి రామయ్య* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు*. పట్టణ బిసి సెల్ అధ్యక్షులు *బిట్రా ఉద్దండయ్య*. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు *అద్దంకి రవి కుమార్*.. గ్రామ రైతులు *దేవి శెట్టి  వీరభద్రం  సంపశాల పుల్లయ్య  సంపాసాల వెంకటేశ్వర్లు. నేలపాల కోటేశ్వరరావు. ముచ్చింతల రవి. దేవిశెట్టి గోపాల్ రావు  ద్వారా నాల ఏసోబు.   రాతికింద కృష్ణ  కోటా మోష* తదితరులు ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.