మొక్కజొన్న పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు వైరా కృషి విజ్ఞాన శాస్త్రవేత్త జె హేమంతకుమార్

Published: Wednesday February 01, 2023
బోనకల్, ఫిబ్రవరి 31 ప్రజా పాలన ప్రతినిధి: మొక్కజోన్న పంటను బాక్టీరియా కాండం కుళ్లు తెగులు ఆశించాయని వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు జె హేమంత్ కుమార్, కె రవికుమార్ లు తెలిపారు. మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో మొక్కజోన్న పొలాలను మంగళవారం కృషి విజ్ఞాన కేంద్రం వైరా శాస్త్రవేత్తలు జె హేమంత్ కుమార్, కె రవికుమార్, మండల వ్యవసాయశాఖ అధికారి అబ్బూరి శరత్బాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులు చేపట్టవల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు.
 తెగులు లక్షణాలు......
ఈ తెగులు ఎర్పడిన క్రైసోందమే జియో అను బాక్టీరియా ద్వారా వస్తుంది. పైరు తొలి దశలో ఆశించిన ఈ తెగులు వలన కనువుకు దగ్గరగా ఉన్న ఆకు తొడిమ, కాండం రంగును కోల్పోయి గోధుమ రంగు నుండి నల్లని రంగు గల మచ్చలు ఏర్పడి మొక్కపై భాగం నుండి వడిలిపోయి ఆకుల అంచుల వెంబడి ఎండిపోతుంది. ఆతర్వాత కింద ఆకులు కూడా పూర్తి ఎండిపోతాయని తెలిపారు. కాండం ఆకుపచ్చ నుండి లేతపసుపు లేక గోధుమ రంగుగా మారి వేడినీళ్లలో ఉడకపెట్టిన బెండులాగా మొక్కజోన్న కాండం మారిపోతుందని అన్నారు. 
 
 యాజమాన్య పద్దతులు....
పంటలో నిలిచిన మురికి నీటిని లేదా డ్రైనేజీ నీటిని పంట తడులకు వాడరాదు. తెగులు సోకిన సమయంలో తాత్కాలిక నత్రజని సంబంధిత యూరియా ఎరువును వాడరాదని తెలిపారు. ఈ తెగులు నివారణకు 33 శాతం క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్ను ఎకరాకు 4 కిలోల చొప్పున పంట పుష్పించే ముందు నీళ్లలో వెదజల్లాలని సూచించారు. డ్రిప్ పద్ధతిలో మొక్కల మొదళ్లను బ్లీచింగ్ పౌడర్ ద్రావణంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు షేక్ ఇబ్రహీం, పి నాగేశ్వరావు, బి రంగయ్య,షేక్ రఫీ, పి రమేష్, బి లాలయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.