ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి **కేసీఆర్ మేధస్సు, ఆలోచనలతో అన్ని వర్గాలకు స

Published: Thursday February 23, 2023

బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)  చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర 31వరోజు నిన్న సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలం, ఎలిమినేడు గ్రామానికి చేరుకుంది. అందులో భాగంగా గ్రామ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మేల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి  ప్రగతి నివేదన యాత్ర ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గడపగడపకు తిరుగుతూ సీఎం కేసీఆర్  నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. ఈరోజు ఎలిమినేడు గ్రామానికి రావటం జరిగిందని అన్నారు.1981లో కొంతమంది పెద్ద మనుషుల ప్రోద్బలంతో నేను సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఆతర్వాత ఈగ్రామ ప్రజల ఆశీర్వాదం వలన 3సార్లు ఎమ్మేల్యేగా గెలిచాను. పుట్టిన గడ్డకు కొంతైనా చేయాలన్న సంకల్పంతో ఎప్పుడు ఎలాంటి అవకాశం దొరికినా సొంతూరిలో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేస్తున్నాను.ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా ప్రతి గ్రామంలో కూడా సంక్షేమ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అందుకు నిదర్శనమే ఎలిమినేడు గ్రామ నుంచి నలుచెరుగులా 9బీటీ రోడ్లు నిర్మాణం చేసుకుంటున్నామని, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. గతంలో వర్షాకాలం వస్తే వరదల వలన పెద్దవాగు పొంగిపొర్లటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. అవతలివారు ఇవతలికి రాలేకపోయేవారు. దాటడానికి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అక్కడ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఇబ్బందులను తొలగించాము. ప్రజాప్రతినిథులంటే ప్రజలకోసం కష్టపడి పనిచేయాలన్న ఉద్దేశ్యంతో ఈగ్రామంలో అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే చేశాం వాటిలో.. బ్యాంకును ఏర్పాటు చేశాం, టెలిఫోన్ ఎక్చేంజ్ను తెచ్చాం, వెటర్నటీ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ సబ్ స్టేషన్, ఉన్నత పాఠశాలను ఈవిధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేయటం జరిగింది. ఎమ్మేల్యేగా గెలిచిన తర్వాత గ్రామాలను అభివృద్ధి చేయటం నావిధి, నాకర్తవ్యం కాబట్టి నేను చేసిన పనులు చిరస్థాయిగా ఉండాలని అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నాను. గతంలో ఈగ్రామంలో త్రాగునీటికి చాలా ఇబ్బందులు ఉండేవి. మహిళలు ఊరి బయటకు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి మంచినీరు తెచ్చుకునేవారు. సీఎం కేసీఆర్ గారు పెద్దమనస్సుతో ఆలోచించి ఇంటింటికి నల్లా నీరు ఇవ్వకపోతే ఎన్నికలలో ఓట్లు అడగబోనని వాగ్దానం చేసి, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఇంటింటికి నల్లానీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు.ఇబ్రహీంపట్నం నుంచి మంగళ్పల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం 59కోట్లు, విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మాణం కోసం 2కోట్లు, కొలనుగూడ నుంచి కొంగర వరకు రోడ్డు నిర్మాణః కోసం 1.70కోట్లు, ఎలిమినేడు నుంచి కప్పపహడ్ వరకు రోడ్డు నిర్మాణం కోసం 80లక్షలు, వెటర్నరీ ఆస్పత్రి నిర్మాణం కోసం 25 లక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కోసం 60లక్షలు ఖర్చు చేయటం జరిగిందని అన్నారు.నేను ఎమ్మేల్యేగా చేసిన ప్రతిపనిని మీముందుకు వచ్చి ధైర్యంగా చెబుతున్నానంటే చేశాను కాబట్టే చెబుతున్నాను. చేసిన ప్రతి పనికి లెక్క చూపిస్తాను, ఆధారాలు పేపర్లు ఇస్తాను. గత 8సంవత్సరాల నుంచి ఎలిమినేడు గ్రామంలో బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ త్రాగునీటి పైపులైన్, మరియు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తు, పూడికతీత.. ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం సుమారు 12.49కోట్లు రూపాయలను ఖర్చు చేసిందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం, మీగ్రామంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో కొన్నింటిని, లబ్దిదారుల కోసం చేస్తున్న ఖర్చు.

1. ప్రతినెలా సుమారు 410మందికి వివిధ రకాల పెన్షన్ల కోసం దాదాపు 9.40లక్షలు

2. రైతుబంధు పథకం ద్వారా సుమారు 1207 మంది రైతులకు దాదాపు 1.63కోట్లు

3. రైతుభీమా పథకంతో సుమారు 13మంది రైతులకు దాదాపు 65 లక్షలు

4. సీఎంఆర్ఎప్ పథకం నుంచి సుమారు 42మందికి దాదాపుగా 13.58లక్షలు 5. కళ్యాణలక్ష్మీ లేదా షాదీముబారక్ పథకంతో సుమారు 117 మందికి దాదాపు 1.09కోట్లు 6. కేసీఆర్ కిట్లు సుమారు 176మందికి పంపీణీ దాదాపు 26.40లక్షలు.

గతంలో రైతులు వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి కోసం అధిక వడ్డీలతో అప్పు తెచ్చుకునేవారు. కానీ సీఎం కేసీఆర్ గారు మాత్రం పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరానికి 10వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారని అన్నారు. రైతు ఏకారణంచేత మరణించినా రైతు కుటుంబానికి భరోసా కల్పించటానికి 5లక్షల రైతుభీమా, పండించిన ధాన్యాన్ని అమ్ముకోవటానికి మద్దతు ధర ఈవిధంగా అనేక రకాలుగా రైతును ఆదుకుటున్నది సీఎం కేసీఆర్ గారేనని ఎమ్మేల్యే కిషన్ రెడ్డి గారు అన్నారు.సీఎం కేసీఆర్ గారి యొక్క ఆలోచన, మేధస్సు వలన ఈనియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, బీటీ రోడ్ల నిర్మాణం చేసుకుంటున్నామని, అదేవిధంగా ముదిరాజులకు చేపలు, యాదవులకు గొర్రెల యూనిట్లు, నాయిబ్రహ్మణులకు, చాకలివారికి 250యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తుందని ఈవిధంగా అన్నివర్గాల వారికి ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ గారు ఇస్తున్నారని ఎమ్మేల్యే కిషన్ రెడ్డి  తెలిపారు. ఈనియోజకవర్గంలో ఏగ్రామంలలో లేని విధంగా పెద్ద రోడ్లు వేయటం జరిగిందని, ఇవన్ని కూడా ముందుచూపుతో ఆలోచించి రోడ్డు విస్తరణ చేశామని, ఈగ్రామంలో భూములు కోల్పొయిన రైతులకు ఇప్పటికే 80కోట్ల పరిహారం చెల్లించటం జరిగిందని, త్వరలో 300ఎకరాలలో పెద్దయెత్తున కంపెనీలు వస్తున్నాయని దీంతో స్థానికులు అధికసంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, మన గ్రామ ప్రజలు బతుకులు మారుతాయని అన్నారు. డిగ్రీ, బీ.టెక్, ప్రొఫెషనల్ కోర్సులు  ఉన్నత చదువులు పూర్తిచేసినవారికి ఎంకేఆర్ పాండేషన్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా కోచింగ్, మెటీరీయల్, ఫుడ్ అన్ని రకాల వసతులను కల్పిస్తున్నాం. ఎంకేఆర్ పౌండేషన్ ద్వారా ఇప్పటివరకు సుమారు 386మంది కానిస్టేబుల్, 13మంది ఎస్సైలు మరియు గ్రూపు-4లో కూడా ఉద్యోగాలు పొందటం జరిగింది. ఇప్పుడు 800 మంది యువతీ, యువకులు శిక్షణ పొందుతున్నారని, వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వం, రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు ద్వారా ఎకరానికి 10వేల రూపాయల ఆర్థిక సహయం అందిస్తూనే.. పంటరుణాలను మాఫీ చేయాలనే ఉద్దేశ్యంతో ఈబడ్జెట్లో సీఎం కేసీఆర్ గారు నిధులను కేటాయించడం జరిగింది. ఎవరికైతే 90వేల లోపు రుణాలు ఉన్నాయో వాటిని వచ్చే రెండు నెలలో మాఫీ చేస్తుందని ఎమ్మేల్యే కిషన్ రెడ్డి గారు అన్నారు. మీగ్రామంలో ఖాళా జాగా ఉండి, ఇళ్లు నిర్మాణం చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం 3లక్షల రూపాయలను ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ గారు బడ్జెట్లో నిధులను కూడా కేటాయించడం జరిగింది. ప్రతి గ్రామంలో అర్హులను గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఖాళీగా ఉండి ఇళ్లు నిర్మాణం చేసుకోవాలనుకునే వారందరూ కూడా మీసేవ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోవాలి.