"బిసి" బందును అమలు చేయాలి

Published: Tuesday April 26, 2022
రాస్ట్ర పద్మశాలి సంఘం నాయకులు కొలిపాక శ్రీనివాస్
బెల్లంపల్లి ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంలోని నిరుద్యోగ, బీసీల అందరికీ, బీసీ  కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని, లేదా "బిసి" బంధు పథకం ఏర్పాటు చేసి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు కొలిపాక శ్రీనివాస్ సోమవారం నాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బెల్లంపల్లిలో "ప్రజాపాలన" ప్రతినిధితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు, ఉద్యోగ నోటిఫికేషన్, జారీ చేయాలని, మరియు గత 10 సంవత్సరాల క్రితం నిలిచిపోయిన  ఉద్యోగాల, భర్తీని రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగులకు, మరియు అన్ని సామాజిక వర్గాలకు వెంటనే ఉద్యోగాల భర్తీ చేయాలని, లేదా యు.ఎన్ లో మాదిరిగా నిరుద్యోగ భృతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం జూన్ 2 వరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, చేయలేని పక్షంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని, బిసి బంధు పథకం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఐదు లక్షల రూపాయల నగదు పథకం ద్వారా "బిసి" బందును అమలు చేయాలని సీఎం కెసిఆర్ను డిమాండ్ చేశారు.