భారీ వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి

Published: Tuesday July 12, 2022
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
మధిర జూలై 11 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిిటీ పరిధిలో సోమవారం నాడు జడ్పీ  చైర్మన్ లింగాల కమల్ రాజుు తో టిఆర్ఎస్ నాయకులు కలిసిి మున్సిపాలిటీ లో
మధిర శివాలయం వద్ద వైరా నది ఉధృతిని పరిశీలించిన. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రజలకు సూచించారు. సోమవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో శివాలయం వద్ద వైరా నది ఉధృతిని వారు టిఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దని వాగులు వంకలు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కనుమూరు వెంకటేశ్వరరావు, అరిగే శ్రీనివాసరావు, మధిర సొసైటీ చైర్మన్ బిక్కీ ప్రసాద్, శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, రైతుబంధు కన్వీనర్ చావా వేణు, వార్డ్ కౌన్సిలర్ వై వి అప్పారావు, టిఆర్ఎస్ మధిర నియోజకవర్గ యూత్ కన్వీనర్ కోన నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు బి వి ఆర్, ప్యారి, కొఠారి రాఘవరావు, బత్తుల శ్రీనివాసరావు, ఎర్రగుంట రమేష్, నల్లమల శ్రీనివాసరావు, జేవీ రెడ్డి దుర్గాప్రసాద్ గద్దల నాని గద్దల రాజా వాల్మీకి పవన్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area