మార్కెట్లలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఒకరోజు దీక్ష

Published: Friday May 28, 2021

వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి : తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ పిలుపు మేరకు మార్కెట్లలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతూ మార్కెట్ యార్డ్ లో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మరియు నరసింహా రెడ్డి మాట్లాడుతూ రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు జరగడం లేదని రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. స్థానిక మంత్రి గాని ఎమ్మెల్యే గాని పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి రమేష్ రాజు, జడ్పిటిసి పద్మ అనంత రెడ్డి, మాట్లాడుతూ ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులు చమరగీతం పడతారని, ముందు రైతులంతా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బండారు నరసింహా రెడ్డి, బత్తిని సహదేవ్, లింగయ్య, కాసుల వెంకన్న, రైతులు మహిళలు పాల్గొన్నారు.