సీపీఐ ఎం సిద్ధాంతానికి కట్టుబడిన నాయకుడు మహేందర్ సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర

Published: Wednesday June 23, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన వేముల మహేందర్ తన తుదిశ్వాస విడిచే వరకూ సీపీఐ(ఎం) సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పులిగిల్ల కు చెందిన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేముల మహేందర్ క్యాన్సర్ వ్యాధితో సోమవారం మరణించారు. మంగళవారం ఆయన అంతిమ యాత్రలో తమ్మినేని పాల్గొన్నారు. తొలుత మహేందర్ భౌతికకాయాన్ని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, నాగయ్యలు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా కార్యదర్శి వెంకట్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, కొండమడుగు నరసింహ, ఐలయ్య,తుమ్మల వీరారెడ్డి, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమట్రెడ్డి చంద్రారెడ్డి, బట్టుపల్లి అనురాధ నర్సిరెడ్డిలు కలిసి సందర్శించారు. మృతదేహంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో తమ్మినేని, మాట్లాడారు. వేముల మహేందర్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఎర్రజెండానే ఊపిరిగా జీవించారని కొనియాడారు, ఆయన లేని లోటు తీరలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ అంతిమ యాత్రలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య, నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి, తుర్కపల్లి సురేందర్, కూర శ్రీనివాస్, తీరిక శ్రీశైలంరెడ్డి, మొగిలి పాక వెంకటేశం, కృష్ణ, గోపాల్, మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, సిపిఎం చౌటుప్పల్ డివిజన్ కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, చిరిక శ్రీశైలంరెడ్డి, మొగిలిపాక గోపాల్, వెంకటేశం, కృష్ణ కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.