రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం

Published: Monday April 04, 2022

రాయికల్, ఏప్రిల్ 03 (ప్రజాపాలన ప్రతినిధి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రాయికల్ శాఖ ఆధ్వర్యంలో శిశు మందిర్ ఆవరణలో హిందూ నూతన సంవత్సర ఉగాది ఉత్సవం(శుభకృతు నామ సంవత్సరం)జరిగింది. ఈ ఉగాది ఉత్సవంలో స్వయం సేవకులు ఆద్య సర్ సంఘ సంచాలక్ ప్రణామ్ చేశారు. ఉగాది కార్యక్రమానికి ఆర్.ఎస్.ఎస్. జిల్లా సంఘచాలక్ డాక్టర్. భీమనాతి శంకర్ పాల్గొని ఉగాది పండుగ వైభవాన్ని మరియు  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జరిపె6 పండగలలో ఉగాది 1, ఉగాది రోజున ఆర్.ఎస్.ఎస్.స్థాపించిన పరమ పూజనీయ డాక్టర్  కేశవ రావు బలిరాం హెడ్గేవార్ (1889 సంవత్సరం) ఈ పర్వదినాన జన్మించారు. డాక్టర్ హెడ్గేవార్ 1925 సంవత్సరం విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని  స్థాపించారని తెలిపారు. పాశ్చ్యాత్య సంస్కృతి యువతను తప్పుదోవ పట్టిస్తుందని, హిందువులలో హిందుత్వ భావన జాగృత పరిచి తద్వారా హిందూ సమాజ సంఘటన చేసి దాని ఆధారంగా దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లాలని యుగ ద్రష్ట డాక్టర్ హెడ్గేవార్ స్వయంసేవకుల ముందుంచారని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆత్మవిశ్వాసంతో అత్యంత సరళమైన మరియు సహజసిద్ధమైన పద్ధతిలో హిందూ సంఘటన జరగడానికి డాక్టర్ జి చూపించిన కార్య పద్ధతి శాఖ, అని అన్నారు. భారత్ ను విశ్వ గురువు స్థానంలో నిలపడానికి, హిందూ ధర్మ రక్షణకై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కట్టుబడి ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఆర్.ఎస్.ఎస్.స్వయం సేవకులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.