అసత్య ఆరోపణలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ దిష్టిబొమ్మ దగ్ధం

Published: Saturday May 29, 2021
మేడిపల్లి, మే28 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై అసత్య ఆరోపణలకు నిరసనగా రామంతాపూర్ పబ్లిక్ స్కూల్ చౌరస్తాలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గడ్డం రవి కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేయడం బిజెపి నాయకులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సంపత్ రావు, కృష్ణా రెడ్డి ,గోపాల్ రెడ్డి, సూరం శంకర్, జెసిబి రాజు, శ్రీధర్, లింగ నాయక్ తదితరులు పాల్గొన్నారు.