రాయపట్నం గ్రామంలో మురుగు నీటి కొలనులు

Published: Thursday September 16, 2021
మధిర, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం రాయపట్నం గ్రామంలోగ్రామంలో గతంలో కురిసిన భారీ వర్షాలకు చేరిన వర్షపు నీరు జనావాసాల మధ్య మురుగునీటి కొలనులుగా దర్శనమిస్తున్నాయి. గ్రామస్తులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులతో ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఏ ఒక్క రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు పొలాల మీదుగా రోడ్ల మీద వచ్చే వర్షపు నీరు గ్రామంలో ఎస్సీ కాలనీ బి.సి.కాలనీ లను ముంచుతున్నప్పటికీ ఆ మురుగు నీరు బయటికి పంపించే డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరమని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో చెత్త సేకరణకు ట్రాక్టర్ రావడంలేదని బ్లీచింగ్ దోమల మందులు స్ప్రే చేయడం లేదని కొన్ని చేతిపంపులు మూడు సంవత్సరాల నుండి రిపేర్ లకు నోచుకోలేదనిగ్రామంలో సమస్యలపై సర్వే నిర్వహించిన సిపిఎం బృందం దృష్టికి వచ్చాయని పార్టీ మండల కార్యదర్శి మంద సైదులు అన్నారు మండలంలో అత్యధిక నిధులు కలిగిన గ్రామ పంచాయతీ అయినప్పటికీ అత్యధిక సమస్యలున్నా గ్రామ పంచాయతీగా రాయపట్నం గ్రామ పంచాయతీ రికార్డులు ఎక్కిందని అన్నారు. ఇల్లు ఇల్లు తిరిగి అధికారులు పాత టైర్ల లోనూ టెంకాయ చిప్ప లోను ఉన్న మురుగునీరు శుభ్రం చేసుకోవాలని సూచించే అధికారులకు రాయపట్నంలోని మురుగునీటి కొలనులు ఎందుకు కనబడటం లేదు? అని గ్రామంలో అంతర్గత రోడ్లు డ్రైనేజీలు కోసం చెత్త సేకరణ కోసం బ్లీచింగ్ దోమల మందులు స్ప్రే లకోసం డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. వెంటనే పంచాయతీ మండల పరిషత్ అధికారులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు మద్దాల ప్రభాకర్ గ్రామ కార్యదర్శి చేగొండి వీరయ్య గో ళ్ల వీరస్వామి గరపాకులగోపి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.