మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతన జీవోను వెంటనే అమలు చేయాలి

Published: Monday February 13, 2023

శంకరపట్నం ఫిబ్రవరి 11 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం మధ్యాహ్న భోజనం పథకం యూనియన్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల జనరల్ బాడీ సమావేశం బొజ్జ సాయిలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ  సమావేశమునకు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ..రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు రాష్ట్ర అసెంబ్లీలో  ప్రకటించడం జరిగిందని, జీవో నెంబర్ 8 ప్రకారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 3000 రూపాయలు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచడం హార్షనీయం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలనే రాష్ట్ర ప్రభుత్వం పెంచినట్లు కనబడుతుందని
దీనిలో కేంద్ర ప్రభుత్వం ఎంత పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 5000 రూపాయలు పెంచుతున్నట్లు గతంలో ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3000 వేతనం పెంచడం చూస్తుంటే దీనిలో అనేక అనుమానాలు ఉన్నాయని,
ఏది ఏమైనా పెంచిన 3000 వేతనాన్ని వెంటనే విడుదల చేసి మార్చి నుండి అమలయ్యే విధంగా చూడాలని రాష్ట్రం ప్రభుత్వాన్ని  కోరుతున్నట్లు అయన తేలిపారు.
జిల్లాలో నవంబర్ నెల నుండి ఇప్పటివరకు వేయి రూపాయల వేతనం కూడ ఇంతవరకు రాలేదని, దీంతోపాటు వంట సామాగ్రి కి పెట్టిన ఖర్చులు 10 నెలలు కావస్తున్న పెట్టిన వంట సామాగ్రి పెట్టిన సరుకుల ధరలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ఇవ్వలేదని,
విద్యాశాఖ అధికారులను అనేకసార్లు విన్నవించినా కూడా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం నుండి రాలేదని చెప్పడం తప్పించుకోవడం జరుగుతుందని అయన ఆవేదన వ్యక్తము చేసారు. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయేంత లోపు బడ్జెట్ను విడుదల చేసి మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ వేతనాలన్నీ కూడా ఇప్పించి కొత్త జీవోలను అమలు చేయాలని, వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అలాగే అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సప్లై చేసినట్టు మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా సప్లై చేయాలని, కూరగాయలు పప్పులు కూడా సప్లై చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా సహాయక కార్యదర్శి పిట్టల సమ్మయ్య, మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధ్యక్షులు బొజ్జ సాయిలు,కొండ రజిత, సైనా బేగం, దుర్గం హాలియా, గడ్డం నాగమ్మ, కత్తెరమల్ల పద్మ, పెరుగు సారమ్మ, తన భోజన కార్మికులు పాల్గొన్నారు.