వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని ధర్నా

Published: Friday August 05, 2022
మేడిపల్లి, ఆగస్టు4 (ప్రజాపాలన ప్రతినిధి)
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉప్పల్ ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి బోయల ప్రతినిధులు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయములో 8 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేనందున రాష్ట్రంలోని వాల్మీకి బోయలు విసుగు చెంది వాల్మీకి బోయల ఐఖ్య కార్యాచరణ కమిటిగా ఏర్పడి అన్నీ మండలాలలోని గ్రామాలు తిరిగి వాల్మీకులలో చైతన్యము తెచ్చిన తెలంగాణ వాల్మీకి బోయల ఐఖ్య కార్యాచరణ కమిటీ దశలవారీగా ప్రభుత్వానికి నిరసన తెలుపడంలో భాగంగా ఆగష్టు 4న రాష్ట్రములోని అన్ని మండలాలలోని ఎమ్మార్వో కార్యాలయాల ముందు ఒకే రోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ధర్నా అనంతరం మండల ఉప తహసిల్దార్ కు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే డిమాండ్ను నేరవేర్చాలని వినతిపత్రం అందజేశారు.   ఈ కార్యక్రమంలో గోపాల్ న్యాయవాది,  బాల్‌రాజ్, ఆంజనేయులు, నర్సింహ, శేఖర్, మహేష్, రాము, శివరాజ్, చిన్న నర్సింహ, సత్యరాజ్(ఎల్బీ నగర్), గంగు, ఆర్కే, నరేష్ తదితరులు పాల్గొన్నారు.