కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి. సిసి రోడ్డు నిర్మాణాల ప్రారంభోత్సవ

Published: Wednesday July 13, 2022
కరీంనగర్ జూలై 12 (ప్రజాపాలన) :
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, గ్రామాల్లో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పని కేంద్ర ప్రభుత్వ  నిధుల భాగస్వామ్యంతోనే జరుగుతున్నాయని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు.
 
మంగళవారం కరీంనగర్ రూరల్  మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ కుమార్ అభివృద్ధి పనులకు  శంకుస్థాపనలు చేశారు.  మండలంలోని పలు గ్రామాల్లో  ఈజీఎస్ నిధులతో చేపట్టిన సిసి రోడ్డులను ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇందులో 7 లక్షల నిధులతో గోపాల్ పూర్ గ్రామంలో, మోగ్దుంపూర్ గ్రామంలో 15 లక్షలు, చర్లబుత్కూర్ గ్రామంలో 7 లక్షల  నిధులతో చేపట్టిన సీసీ రోడ్లును  ఎంపీ బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిధులతో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపడితే   ఇక్కడి టిఆర్ఎస్ ప్రభుత్వం సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టుగా వ్యవహరిస్తుందన్నారు.  అందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్రామాలకు నేరుగా నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు.
 
ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, కిసాన్ మోర్చా నాయకులు రమణారెడ్డి, శివారెడ్డి, ఉప సర్పంచ్ లు శేఖర్, తిరుపతి మరియు ఆ గ్రామాల్లో వార్డ్ మెంబర్లు, మండల నాయకులు, తిరుపతి, గోపాల్, మహేందర్, రమేష్, నరేష్ వివిధ మోర్చా అధ్యక్షులు రమేష్, కమలాకర్, పద్మ, శ్రీధర్, శివరామకృష్ణ జిల్లా మోర్ఛ నాయకులు, సతీష్, సుజన్, శివారెడ్డి, సునీల్, రామచంద్రం, వెంకటేష్, ప్రవీణ్, శ్రవణ్ రెడ్డి, ఆంజనేయులు, అనిల్, మారుతి, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.