డివిజన్లో మంచినీళ్ల సమస్య రాకుండా చర్యలు

Published: Friday March 03, 2023
  కార్పొరేటర్ చేతన హరీష్
మేడిపల్లి, మార్చి2 (ప్రజాపాలన ప్రతినిధి) 
వేసవికాలంలో ప్రజలకు మంచినీళ్ల సమస్య రాకుండా హబ్సిగూడ డివిజన్లో చర్యలు తీసుకుంటున్నామని స్థానిక కార్పొరేటర్ కక్కిరెణి చేతన హరీష్ తెలిపారు. డివిజన్లోని శ్రీనివాసపురం కాలనీలో ప్రధాన రహదారిలో చాలా రోజులుగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, మంచినీళ్లు ఎప్పుడు సరిగా రావని వచ్చిన కలుషిత నీళ్లు వస్తాయని స్థానికలు తెలపడంతో స్పందించిన కార్పొరేటర్ అధికారులతో మాట్లాడి సుమారు రూ 4 లక్షల రూపాయలతో కొత్త పైపులైను నిర్మాణ పనులను ప్రారంభించారు. పైపులైను  పనులను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు.   
ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ రవీందర్ ,వర్క్ ఇన్స్పెక్టర్ కిషన్, బిజెపి నాయకులు ప్రధాన కార్యదర్శి చేల్లోజు  ఎల్లాచారి ,వేములకొండ వెంకన్న గౌడ్, సంగప్ప, శ్రీనివాసపురం కాలనీ సభ్యులు వెంకటయ్య , కృష్ణ స్వామి, వై వి కే రాజు, సత్యనారాయణ చారి  పాల్గొన్నారు.