సామాన్య ప్రజల పైనే చట్టాలు పని చేస్తాయి....

Published: Friday May 21, 2021
ఫైన్ లు చలనాలు సామాన్యులకేనా !
పరిగి, మే 20 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ రోజు రోజుకి గాడి తప్పుతోంది. చట్టాలు ఎవరికి చుట్టాలు కావు. చట్టానికి అందరూ సమానమే అంటూ చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. చట్టాలు కొందరికి చుట్టాలుగా మారి కొమ్ము కాస్తోంది అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిగి నియోజక వర్గ పరిధిలోని దోమ మండలంలో పోలీసుల వ్యవహార శైలి ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి అని పలువురు ప్రజా ప్రతినిధులు,ప్రజలు ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజల పట్ల పోలీసుల వ్యవహార శైలి భిన్నంగా ఉంటుందని,సామాన్యులు తప్పు చేస్తే ఆగ మేఘాల మీద చలనాలు కేసులు అంటూ హడల్ చేస్తారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం దోమ మండల కేంద్రంలో పోలీసు స్టేషన్ కు కూత వేటు దూరంలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.అయితే ఇక్కడ 100 కు పైగా జనాలు ఒకే చోట కూడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించారని పలువురు పోలీసుల తీరుని విమర్శిస్తున్నారు. అంతే కాక పలు గ్రామాలలో పెళ్ళిళ్ళు విందులు వినోదాలు జరుగుతున్న పోలీసులు అక్కడకు వెళ్లిన చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారనే అని గుస గుసలు సైతం విన్పిస్తున్నాయి. కావున ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.