మండల్ పరిషత్ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం

Published: Thursday December 02, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 01 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో నెహ్రూ యువ కేంద్రం, ముత్తూట్ ఫైనాన్స్ వారి సౌజన్యంతో గాంధీ ఆస్పత్రి వారు బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిభిరంలో పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సైతం రక్తదానం చేసి ఆపద కాలంలో ఉన్న అభాగ్యులను ఆదుకునేందుకు తన వంతుగా రక్తాన్ని అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మహేష్ బాబు మాట్లాడుతూ రక్తదాతే ప్రాణదాత ఆని యువత మీదే దేశ ప్రగతి ఆధారపడి ఉందని రక్తదానం లాంటి మంచి పనుల్లో పాల్గొని ఎదుటివారి ప్రాణాలు కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ కె వై యస్ డైరెక్టర్ అంచుమబ్  ప్రసాద్ దాస్, జిల్లా యూత్ ఆఫీసర్ ఐసయ్య, ఏ డి ఎం హెచ్ ఓ సోలమన్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జ్యోతి, ముత్తూట్ ఫైనాన్స్ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, ఉప్పరి గూడ పంచాయతీ కార్యదర్శి రుషిక నేత, శ్రీ ఇందు, జి ఎన్ ఐ టి, సిద్ధార్థ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కళాశాలల విద్యార్థులు 65 మంది పాల్గొని రక్తదానం చేశారు అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు అందరిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహేష్ బాబు అభినందించారు.