ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగించాలని

Published: Saturday June 12, 2021
మధిర, జూన్ 11, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారుమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ... కరోనో మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో  ఉన్నా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు అడ్డగోలుగా పెరుగుతున్నాయని మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఆక్షేపించారుదేశంలోని చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటిందని, ఈ పెరుగుదల వల్ల అన్ని గృహవసరాలు మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని ఆయన వివరించారుగత 13 నెలల్లో, పెట్రోల్ పై లీటర్ కు రూ.25.72 డీజిల్ పై లీటరుకు  23.93 పెరిగాయని, ఈ ఐదు నెలల్లో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారుఈ కార్యక్రమంలో మధిర నియెజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు బెజ్జం శ్రీకాంత్, దేవరకొండ రాజీవ్ గాంధీ, మండల కాంగ్రెస్ నాయకులు INTUC అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి, యన్నం పిచ్చిరెడ్డి, మైనార్టీ అధ్యక్షులు షేక్ బాషా, సొసైటీ అధ్యక్షులు కడియం శ్రీనివాసరావు, ఎర్రుపాలెం టౌన్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, బోస్ గారు, కంచర్ల వెంకటనర్సయ్య, గాంధీ పదం అధ్యక్షులు రావూరి నాగబాబు ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, సూరంసెట్టి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.