మధిర గడ్డ, కాంగ్రెస్ అడ్డా అంటున్న సీఎల్పీ నేత భట్టి

Published: Monday April 04, 2022
బోనకల్, మార్చి 3 ప్రజాపాలన ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఈ పాదయాత్రను వెంట్రుక తో సమానం అన్న వెధవలు దీని ప్రతి ఫలం అనుభవించక తప్పదు అంటూ, ప్రజలు ప్రజా సమస్యలు మీకు వెంట్రుకతో సమానమా అంటూ నాయకుల పై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 8ఏండ్లల్లో ఏంత మందికి కొత్త ఫించన్లు , డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారో తెలియజేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పటి వరకు లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారనీ ఎద్దేవా చేశారు. వరుసగా 10 రోజులుగా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్య పేద ప్రజల పై తీవ్రమైన భారం మోపిన మోడీ సర్కార్ ను ప్రజలు గుణపాఠం చెప్పాలని సీఎల్పీ నేత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను అచ్చే దిన్ తీసుకొస్తానని ఇప్పుడు 1050 రూపాయలకు పెంచి ప్రజలకు సచ్చే దిన్ తీసుకొచ్చాడనీ మండిపడ్డారు. మోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే టిఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందనీ, ధరలు పెంచి ప్రజల నడ్డి విరగొట్టడంలో మోడీ, కేసీఆర్ పోటీ పడుతున్నారనీ, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రాజకీయాల కోసమో, నా కోసమో కాదని, ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ఈ పాదయాత్ర ని వారు అన్నారు. రైతులు తెలంగాణలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలని, ఈ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనిపించాలనే ఈ పాదయాత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను జయప్రదం చేశారు.