మా భూములనుండి ఓంకారేశ్వర దేవాలయం పెరు వెంటనే తొలగించాలి* *నాల్గు తరాల నుండి సాగు చేస్తున్నా

Published: Wednesday September 14, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధిముందుగా యాచారంలో ర్యాలీ తీసి అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ దూస రమేష్ గారు జె రాములు కృష్ణ రాజిరెడ్డి జంగయ్య తదితరులకు దండలు వేసి దీక్ష ప్రారంబిచడం జరిగింది. *వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య భూసాధన కమిటీ సమన్వయ కమిటీ కార్యదర్శి జోగు రాములు అధ్యక్షతన జరిగింది*

ఈ సందర్బంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ

నాలుగు తరాల నుండి సాగుచేస్తున్న కౌలు రైతులకు పట్టాలు ఇవ్వకుండా భూ యజమానులు రైతులను మోసం చేసి శిస్తు వసూలు చేయడం.ఓంకారేశ్వర దేవాలయం పేరు పెట్టడం చాలా దుర్మార్గం. అన్ని రకాలుగా రైతులకు అవకాశం ఉన్నప్పటికీ భూ యజమానుల కుట్ర బుద్ధితో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. 1950 లో 37ఏ సర్టిఫికెట్ ఇచ్చినారు వెంటనే 38 ఈ సర్టిఫికెట్ ఇచ్చి పట్టాలు ఇయ్యాలి. దీనిపైనా రెవెన్యూ శాఖ మంత్రి. ముఖ్య మంత్రి గారు స్పందించి వెంటనే పట్టాలు ఇయ్యాలని కోరుతున్నాము లేని యడల పట్టాలు వచ్చేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాము

ఈకార్యక్రమంలో సర్పంచి భూసాధన కమిటీ గౌరవాధ్యక్షులు దూస రమేష్ భూసాధన సమన్వయ కమిటీ కార్యదర్శి జె రాములు నాయకులు రాజిరెడ్డి బి కృష్ణ కె జంగయ్య రాములు ఎం జంగయ్య ( AiAWU)వెంకటేష్ ch చిత్తరి సంజీవ డి యాదయ్య చెన్నారెడ్డి గాలయ్య పర్వతాలు వీరప్ప s యాదయ్య బి రాజిరెడ్డి డి నర్సింహా డి రవి బి జంగయ్య ఎన్ లక్ష్మమ్మ బి సత్తమ్మ రాములమ్మ పోషమ్మ శేఖర్ ఎం v మైసయ్య అంజయ్య బి విజయ్ తదితరులు పాల్గొన్నారు.