నేడు బిఎస్పి కార్యాలయం ప్రారంభం

Published: Wednesday November 30, 2022
బిఎస్పి జిల్లా అధ్యక్షుడు గొర్లకాడి క్రాంతికుమార్
వికారాబాద్ బ్యూరో 29 నవంబర్ ప్రజాపాలన : బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయం ప్రారంభం  బుధవారం ప్రారంభం కానున్నదని బిఎస్పి జిల్లా అధ్యక్షుడు గొర్లకాడి క్రాంతికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వికారాబాద్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయం  ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా„ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విచ్చేయుచున్నారు. వికారాబాద్ అసెంబ్లీలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, బహుజన బంధువులు, ఆర్ఎస్పి అభిమానులు, అందరూ మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కొండా బాలకృష్ణారెడ్డి గార్డెన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు కొత్త జాయినింగ్స్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సమక్షంలో జరుగుతాయని వివరించారు.