మిరప పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు..

Published: Thursday October 27, 2022
తల్లాడ, అక్టోబర్ 26 (ప్రజాపాలన న్యూస్):
మండల పరిధిలోని వెంగన్నపేట, నూతనకల్, మంగాపురం గ్రామాల్లో వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం వైరా  ఆధ్వర్యంలో వరి, మిరప పంటలను వ్యవసాయ అధికారులు బుధవారం పరిశీలించారు. వెంకన్నపేట గ్రామంలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు తట్టుకునే ఇంప్రూవ్డ్ సాంబ వరి పంటను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా వైరా శాస్త్రవేత్త డాక్టర్.  హేమంత్ కుమార్  మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, అగ్గి తెగులు, మాని పండు తెగులు గమనించడం జరిగిందని తెలియజేశారు. బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు నియంత్రణకు గాను ప్లాంటోమైసిన్ లేదా పోష మైసిన్ 0.2 గ్రాములు లేదా అగ్రి మైసిన్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెవికె వైరా శాస్త్రవేత్తలు డాక్టర్ రవికుమార్, డాక్టర్ చైతన్య, తల్లాడ మండల వ్యవసాయ అధికారి  తాజుద్దీన్, ఏఈఓలు గురుమూర్తి, త్రివేణి రైతులు పాల్గొన్నారు.