ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం.

Published: Wednesday April 06, 2022
మధిర ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు కర్తిశేషులు. గొకర్ల. చంద్రం ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు. ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రముఖ వైద్యులు. డాక్టర్ రామనాథం విచ్చేసి అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా ఆశ్రమంలో అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా ఆర్ కే ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ రామనాథం కి.అన్నదానం నిర్వహించిన వారి కుటుంబ సభ్యులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మల్లాది హనుమంతరావు 14వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు గారు. ఆర్కె పౌండేషన్ రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్ కె సుదర్శన్ రామారావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.