బస్తీ సమస్యల పరిష్కారానికి కృషి

Published: Wednesday February 02, 2022
మాజీ కార్పొరేటర్ శేషు కుమారి
అమీర్ పేట్ (ప్రజాపాలన ప్రతినిధి) : డివిజన్ సమస్యలను మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు మాజీ కార్పొరేటర్ శేషు కుమారి. అమీర్ పేట్ డివిజన్ లోని కుమ్మరి బస్తిలోని పలు సమస్యలపై స్థానిక తెరాస మరియు బస్తీ నాయకులతో కలిసి బస్తీలో పర్యటించిన ఆమె తన హయాంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ చాలా రోజుల నుంచి అందుబాటులోకి రాకపోవడంతో దానిని బస్తీకి ఉపయోగపడేలా బస్తీ దవాఖాన కోసం కేటాయించేలా చూడాలని స్థానిక బస్తీ నాయకులు శేషు కుమారి దృష్టికి తీసుకువచ్చారు.అలాగే రెండు గల్లీలలో తరుచుగా డ్రైనేజీ పొంగి పొర్లుతునాయి దాని వలన కలుషిత నీరు వస్తుంది అని తెలిపారు. పలు చోట్ల లో ప్రెషర్ సప్లయ్ తో ఇబ్బందులకు గురవుతున్నారు అని తెలపడంతో శేషు కుమారి మాట్లాడుతూ బస్తీ దవాఖాన విషయం మంత్రి తలసాని దృష్టికి తీసుకువెళ్ళి దవాఖాన మంజూరు కోసం కృషి చేద్దామని అన్నారు. స్థానిక డ్రైనేజీ మరియు నీటి సమస్యలపై ఇంతకుముందే మంత్రి తలసాని వాటర్ వర్క్స్ జీ ఏం హరీష్ శంకర్ తో మాట్లాడి ప్రతిపాదనలు సిద్దం చేసారని త్వరలో కొత్త లైన్లు మంజూరు అవుతాయని తెలిపారు. బస్తీలో పర్యటించిన వారిలో మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు, సీనియర్ నేత సత్యనారాయణ యాదవ్, స్థానిక నేతలు లక్ష్మణ్, శేఖర్ గౌడ్, నరేష్ నాయి, సుమీత్ సింగ్, కట్ట బలరాం మరియు బస్తీ నాయకులు శివ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.