సమస్యల సుడిగుండంలో మధిర రైల్వే స్టేషన్ నిలయం సమస్యలపై డిఆర్ఎం దృష్టి సారించాలి

Published: Tuesday December 13, 2022

మధిర డిసెంబర్ 12 (ప్రజాపాలన ప్రతిని ధి ) నియోజకవర్గ ముఖ్యమైన మధిర ఉన్న రైల్వే నిలయంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. తొలిసారిగా మధిర రైల్వే స్టేషన్ తనిఖీ చేసేందుకు వస్తున్న సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా మధిర రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మధిర రైల్వే స్టేషన్ నుండి రైల్వే శాఖకు ప్రతిరోజు సుమారు రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. మధిర రైల్వేస్టేషన్లో భోగిల వివరాలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజు కందుబాటులోకి వస్తున్న తరుణంలో భోగీలు వివరాలను మధిర రైల్వే నిలయంలో ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా రైల్వే నిలయానికి రెండో ప్లాట్ పారం పక్కన రైల్వే శాఖకు సంబంధించి విశాలమైన స్థలం ఖాళీగా ఉంది ఆ స్థలంలో భారీగా చెట్లు పెరిగి చిట్టెడును తలపిస్తున్నాయి. ఆ స్థలాన్ని శుభ్రం చేసి వినియోగంలోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు మొన్నటి వరకు ఒకటో ప్లాట్ పారం వైపు కూడా ఉన్న రైల్వే ఖాళీ స్థలం మురికి కోపంగా ఉండేది ఇటీవల మధిర పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థలాలను శుభ్రం చేసి పార్కులు ఏర్పాటు చేశారు. మధిర రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రోజురోజుకీ పట్టణ జనాభా పెరుగుతున్న తరుణంలో వన్ టౌన్ నుండి టూ టౌన్ కు రావాలంటే ఖచ్చితంగా రైలు పట్టాల మీదనుండే  ప్రజలు రాకపోకలు కొనసాగించాలి దీనిని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు ఈ ప్రాంతంలో స్టెప్స్ కం అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రజల కోరుతున్నారు. డిఆర్ఎం వస్తున్నారని రైల్వే శాఖ అధికారులు ఆగమేఘాల మీద మధిర రైల్వే నిలయంలో ఫ్యాన్లు రిపేరు చేయించడం, రంగులు వేయించడం, త్రాగునీరు సౌకర్యం కల్పించడం, విశ్రాంతి గదులకు మరమ్మతులు చేపట్టటం, రెండు ప్లాట్ పారాలను శుభ్రంగా ఉంచటం రైల్వే పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లడం మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడం లాంటి పనులను పూర్తి చేశారు. ఖమ్మం తర్వాత అతి పెద్దదైన మధిర రైల్వే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిఆర్ఎంని మధిర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.