మాటూర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు*మధిర

Published: Friday December 23, 2022

రూరల్ డిసెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు మాటూరు ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ గణత దినోత్సవం వేడుకలు మాటూరు ఉన్నంత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు తన అద్భుతమైన గణిత ప్రతిభతో అతితక్కువ సమయంలో ఎవరూ సాధించలేని గణిత సిద్ధాంతాలను రూపొందించిన *భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్* జన్మదిన వేడుకలు మాటురు ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శ్రీ దీవి సాయికృష్ణమాచార్యులు మాట్లాడుతూ క్లిష్టమైన గణితాన్ని సులభతరం చేయుటకు రామానుజన్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. రామానుజన్ ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులందరు చిన్నవయసు నుంచి గణితంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల గణిత ఉపాధ్యాయుడు మేడేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు *గణిత టాలెంట్ టెస్ట్* నిర్వహించడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థులకు *గణిత క్విజ్, రామానుజన్ చిత్రలేఖన* పోటీలు నిర్వహించడం జరిగింది. విజేతలకు గణిత ఉపాధ్యాయుడు మేడేపల్లి శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, గుంటుపల్లి రమాదేవి పాల్గొన్నారు.