ఆలేరు ఎన్.సి.సి. ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం

Published: Monday November 28, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 26 నవంబర్ ప్రజాపాలన:
 
ఆలేరు  ఉన్నత పాఠశాలలో ఎన్.సి.సి. ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఈ కార్యకమానికి ప్రధానోపాధ్యాయులు ఎస్. నారాయణ మరియు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సీస గోవర్ధన్ ముఖ్య అతిధి గా విచ్చేశారు. ఎన్.సి.సి. కాడెట్లను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు నారాయణ  మాట్లాడుతూ... నవంబర్ 26 న మనం జాతీయ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. రాజ్యాంగం వల్లనే మనం ఈ రోజు ఇలా  జీవిస్తున్నా  మని గుర్తు చేశారు. రాజ్యాంగం అద్భుతం కాని దాని అమలులో లోపాల వల్ల దాని ఫలాలు అందరికీ అందడం లేదని అన్నారు. రాజ్యాంగంలో లోపం కాదు దాన్ని సరిగా అమలు చేయడం లో లోపం అని అన్నారు. చైర్మన్ సీస గోవర్ధన్ మాట్లాడుతూ.. ఈ రాజ్యాంగం వల్లనే ఈ రోజు విద్య వైద్యం పేదవాడికి అందుతున్నాయని తెలిపారు.  ఎన్.సి.సి అధికారి దూడల వెంకటేష్, సీనియర్ ఉపాధ్యాయులు మంద సోమరాజు తదితరులు మాట్లాడారు.తదుపరి ఎన్.సి.సి. కాడెట్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోటగిరి శేఖర్, యోగేశ్వర్ రావు, హరనాథ్ రెడ్డి, నవీన్, వేణు, రవి, మురళి , మేరీ స్వరూప రాణి, కవిత , స్వర్ణలత, లక్ష్మమ్మ, మీరా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.