పటిష్ట కుటుంబం-పటిష్ట సమాజం అనే అంశంపై జాగృతి ఉద్యమం

Published: Tuesday March 02, 2021
మధిర మార్చి ఒకటి ప్రజాపాలన ప్రతినిధి: జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ ఆధ్వర్యంలో పటిష్ట కుటుంబం-పటిష్ట సమాజం అనే అంశం పైన రాష్ట్రవ్యాప్తంగా జాగృతి ఉద్యమం ఫిబ్రవరి 19 నుండి పదిరోజులపాటు నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం మధిర మరియు ఖాజిపురం శాఖ ఆధ్వర్యంలో ఖాజిపురం లోని షాదీఖానా యందు ఈ రోజు బహిరంగ సభను ఏర్పాటు చేయడం. జమాతే ఇస్లామి హింద్ కాజీ పురం శాఖ అధ్యక్షురాలు నాజియాబేగం ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జమాతే ఇస్లామి హింద్ ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఖాసీమ బాజి, మధిర మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి మొండితోక లత గారు, మధిర మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి శీలం విద్యా లత గారు, జమాత్ కార్యకర్తలు, మధిర మరియు కాజీపురం గ్రామ మహిళలు పాల్గొన్నారు. నేటి కాలంలో కుటుంబ విలువలు తరిగిపోతున్నాయని, సమిష్టి కుటుంబాలు కూడా అంతరించి పోయాయి అని, నేటి తరం పిల్లలకు కుటుంబ విలువల పట్ల, సమాజ విలువల పట్ల, అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దలకు ఉందని ముఖ్య వక్తలు పేర్కొన్నారు. ఈ సమావేశానికి హాజరైన ముఖ్య వ్యక్తులకు జమాత్ తరఫునుంచి వారిని సన్మానించడం జరిగింది