దొరలకు ఎదురుతిరిగి పోరాడిన పోరు బిడ్డ,** - తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన వీరవనితా, -

Published: Tuesday September 27, 2022

చేవెళ్ళ సెప్టెంబర్ 26:(ప్రజా పాలన)

ఈరోజు స్థానిక చేవెళ్ల మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు సి ఐ టి యు ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగిందని సిఐటియు చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్ అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించిందని పటేల్ దొరలకు   పట్వారిలకు దేశముకులకు రజాకార్లకు వ్యతిరేకంగా ఎర్రజెండా చేత పట్టి పోరాటం చేసిందని ఆ పోరాటంలో తన భర్తను పిల్లలను కోల్పోయిన అదరకుండా దళాలుగా ఏర్పడి ఒక చేత ఎర్రజెండా ఒక చేత్తో తుపాకీ పట్టి తెలంగాణ గడ్డ నుంచి నైజాం సర్కార్ను వెల్లగొట్టడంలో కీలకపాత్ర పోషించిందని అన్నారు. 1946లో ఐలమ్మ సాగుచేసిన పంటను కాజేయడానికి జమీందారు విసునూరు రామచంద్రారెడ్డి గుండాలను పంపాడని ఆంధ్ర మహాసభ సంఘం పేరుతో కమ్యూనిస్టు నాయకుల సహాయంతో ఐలమ్మ ఆ గుండాలను తరిమి కొట్టిందని అన్నారు అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ పిలుపునందుకొని ఆయుధాలు చేతపట్టి జమీందారులకు భూస్వాములకు బుద్ధి చెప్పింది ఆ పోరాటం భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగిందని కానీ నేటి కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బిజెపి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎక్కడ పాలుపంచుకోలేదని అన్నారు వారు చరిత్రను వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మది చెరగని ముద్ర అని ఆమె నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు సిహెచ్ నరేష్ ఎస్ ఎఫ్ ఐ  డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు