నిరుద్యోగులపై లాఠీ చార్జీ - నాగర్ గూడలో కాంగ్రెస్ నిరసన

Published: Tuesday October 05, 2021
హైదరాబాద్ అక్టోబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిరుద్యోగుల జంగ్ సైరన్ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిచారు. నిరుద్యోగుల జంగ్ సైరన్ లో శాంతి యుతంగా పాల్గొన్న నిరుద్యోగలపై పోలీసులు లాఠీ చార్జి చేసి విచక్షణా రహితంగా కొట్టిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఆదివారం నాడు నాగర్ గూడ కూడలిలో కేసిఆర్ మరియు కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి మాచనపల్లి రామిరెడ్డి, సురెందర్ రెడ్డి, అధికార ప్రతినిధి పామెన భీమ్ భరత్, సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి భార్గవ్ రామ్, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపల్లి పెంటారెడ్డి, షాబాద్ మండల ఉపాధ్యక్షుడు చందనవెల్లి యాదయ్య, సీనియర్ నాయకులు రాంచందర్, మాజీ సర్పంచ్ మన్మరి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షుడు అక్తర్ భాయి, చర్లగూడెం మాజీ సర్పంచ్ మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ మెంబెర్స్ వివిధ గ్రామాల యంపిటిసిలు సర్పంచ్ లు మరియు నాయకులు పాల్గొన్నారు.