ప్రజల సహకారంతోవిజయవంతమైన ఆరోగ్య మేళ క్యాంప్.

Published: Friday April 22, 2022
మధిర ఏప్రిల్ 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో గురువారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరవ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆరోగ్య మేళ హెల్త్ క్యాంప్ ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిధి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఈ ఆరోగ్య మేళా హెల్త్ కార్డు నందు 1326 మంది వివిధ విభాగాల ద్వారా సేవలను పొందినారు.. క్యాంపు నందు రక్త పరీక్షలు 230,ECG తీసుకున్నవారు 280 మంది, స్కానింగ్ తీసుకున్నవారు 107 మంది, కంటి పరీక్షలు 130 మందికి దంత పరీక్షలు 70 మందికి, ఆర్థోపెడిక్ సేవలు, పొందినారు. క్షయ, వ్యాధి, డెంగ్యూ, మలేరియా, షుగర్ బిపి, క్యాన్సర్ వ్యాధులపై ఆరోగ్య అవగాహన కల్పించడం జరిగింది డాక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ లింగాల కమల్ రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి లత జయకర్  మరియు వైస్ చైర్మన్ విద్యా లత వెంకటరెడ్డి, ఎంపీపీ మొండెం లలిత వెంకయ్య, చిటారు నాగేశ్వరరావు ఆత్మ కమిటీ రంగిశెట్టి కోటేశ్వరరావు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, ఆరోగ్య మేళా హెల్త్ క్యాంపు ఇంచార్జ్ డాక్టర్ వెంకటేష్ సివిల్ హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ మనోహర్ సీనియర్ వైద్యులు అనిల్ కుమార్ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ బనిగండ్లపాడు వైద్యులు సుధాకర్ బోనకల్లు వైద్యాధికారి డాక్టర్ వైద్య వైద్య సిబ్బంది, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, MCH జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ సైదులు, జిల్లా క్షయ నివారణ అధికారి సుబ్బారావు, NCD వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ కోటి రత్నం వారి వైద్య బృందం, జిల్లా వివిధ విభాగాల సూపర్ స్పెషాలిటీ వైద్యాధికారులు, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మాస్ మీడియా అధికారి సాంబశివ రెడ్డి, మురళి, జిల్లా ఆయుష్ విభాగం భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం, యునాని, హోమియో  సీనియర్ మెడికల్ అధికారుల వైద్య బృందం డాక్టర్ హరికిషన్, డాక్టర్ శ్రీలత, డాక్టర్ నాయక్, డాక్టర్ శంకర్, అమీరా, పారామెడికల్ వైద్య బృందం, వైద్యులు, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ శ్రీనివాస్, ఐసిడిఎస్ సిడిపిఓ శారద ఆధ్వర్యంలో ఆహార ప్రదర్శనశాల, బోనకల్, దెందుకూరు, బనిగండ్లపాడు, మాటూరు పేట వైద్య అధికారులు మరియు వైద్య సిబ్బంది ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు హెల్త్ అసిస్టెంట్స్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొన్నారు.