బిజెపి తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి : ప్రజా సంఘాల జె ఎ సి చైర్మన్ గజ్జెల కాంతం. హైదరాబాద్ (ప్ర

Published: Thursday November 10, 2022
బీసీ లకు బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ ఏం చేశాడో చెప్పాకనే తెలంగాణలో అడుగుపెట్టాలని అన్నారు ప్రజా సంఘాల జె ఎ సి చైర్మన్ గజ్జెల కాంతం.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ బిజెపి బీసీల వ్యతిరేక పార్టీ అన్నారు. జి ఎస్ టి తో నేతన్నలపై పెనుభారం విధించారని అన్నారు. బీసీ ల జనగణన చేయకుండా బీసీలను బిజెపి వంచిస్తుందన్నారు. 
స్పష్టమైన ప్రకటన చేయకుండా తెలంగాణ లో మోడీ అడుగుపెడితే తప్పనిసరిగా నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.మోడీ రాకను తెలంగాణ ప్రజలు అడ్డుకొని తీరుతారని అన్నారు.కేంద్ర ప్రభుత్వం నేటి వరకు విభజన హామీ లను పూర్తి చేయలేదని, యువత కు ఉద్యోగాలు ఇవ్వలేదని, రైతులకు నల్ల చట్టాలు తీసుకొని వచ్చారని, ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ని కొత్తగా రంగులేసి ప్రారంభోత్సవం చేస్తామనడం విడ్డురంగా ఉందన్నారు. కేంద్రం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించలేదన్నారు, ప్రభుత్వ రంగ సంస్థ లన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని ఇది బిజెపి ప్రజలకు చేస్తున్న అన్యాయం అని అన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే రామగుండంలో అడుగు పెట్టాలన్నారు.  తెలంగాణ లో ఈడీ, ఐటి దాడులతో ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారన్నారు, తెలంగాణ లో పెట్టినన్ని సంక్షేమ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం లో కూడా అమలుకు నోచుకోవట్లేదన్నారు.నవంబర్ 28,29,30 తేదీలలో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో గజ్జెల కాంతం తో పాటు  పిడమర్తి రవి, రాజారాం యాదవ్, ఓరుగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.