అభివృద్ధే ధ్యేయంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ధన్యవాదాలు తెలిపిన బూర్గంపాడు జడ్పిటిస

Published: Wednesday November 30, 2022

బూర్గంపాడు (ప్రజాపాలన.)

బూర్గంపాడు మండలానికి మండల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించిన ప్రభుత్వ విప్  పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కి ధన్యవాదాలు తెలియజేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత. అందులో భాగంగానే సారపాక పట్టణానికి పట్టణ అభివృద్ధి కోసం అంతర్గత రోడ్లు కోసం రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు జడ్పిటిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు ఎక్కడెక్కడ అంతర్గత రోడ్లు మిగిలిపోయాయో వాటి గురించి కొలతలు తీసుకుని పట్టణ అభవృద్ధికి దోహదం చేసేందుకు అనునిత్యం ప్రజల కొరకు కార్యక్రమం ద్వారా అంతర్గత రోడ్లు ఎక్కడెక్కడ లేవు అని గత నెలలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత బృందం గుర్తించడం జరిగింది. జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత రోడ్లు గుర్తించి వాటిని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు పరిశీలించి పట్టణ అభివృద్ధి కోసం వెంటనే రెండు కోట్ల నిధులు కేటాయించడం జరిగినది. దానిలో భాగంగానే ఈరోజు అంతర్గత రోడ్లు మొత్తం కూడా కొలతలు వేసి ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. వారు వీటిని పరిశీలించి వెంటనే అప్రూవల్ వచ్చే విధంగా అభివృద్ధి జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, దుర్గంపాడు పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టౌన్ ప్రెసిడెంట్  కొనకంచి శీను బాలి శ్రీహరి ,చల్లకోటి పూర్ణ లక్ష్మిరెడ్డి ,ఏసోబు ,కృష్ణ, మణికంఠ ,సాయిబాబా, ఆంజనేయులు  చుక్కపల్లి బాలాజీ, తదితరులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.