పల్లె ప్రగతిలో భాగంగా చెట్ల పంపిణీ

Published: Tuesday July 06, 2021

వలిగొండ మండల పరిధిలోని జాలుకాలువ, నెమలికాలువ, వెల్వర్తి గ్రామాలలో 4వ విడత కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రామాలలో ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు నోడల్ అధికారులు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటడం రోడ్లకు ఇరువైపులా చెట్లను జెసిబి సాయంతో తొలగించి, గుంతలను మట్టితో పూడ్చడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు మద్దెల సందీప్ గౌడ్, వంగాల బిక్షపతి గౌడ్, పసల అన్న మేరి శౌరి, ఉప సర్పంచ్ సారగండ్ల లింగస్వామి, పంచాయతీ కార్యదర్శులు జి అపర్ణ, స్వరూప, నరేందర్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.