అధికారులు మామూలుగా తీసుకున్నారట

Published: Saturday February 20, 2021

యధేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ కట్టడం

క్యాతన్ పెల్లి పిబ్రవరి 19, ప్రజాపాలన: క్యాతన్ పెల్లి  మున్సిపల్ పరిదిలోని ఒకటో వార్డులో కటిక దుకాణాల సమీపాన గత వారం క్రితం అధికారులు నిలిపివేసిన అక్రమ కట్టడాన్ని తిరిగి ప్రారంబించారు. ఏజెన్సీ యజమాని  అధికారుల మాటలను పెడచెవిన పెట్టి కబ్జాకు పాల్పడడం కాలనీవాసుల్లో, పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో అధికారులు మామూలుగా తీసుకుని సహాకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీలా ఉంటే అధికారులకు డబ్బులు ఇచ్చి నిర్మాణం తిరిగి చేపట్టానని కబ్జాకు పాల్పడుతున్నా వ్యక్తి బహిరంగంగానే పేర్కొనడం అధికారుల పై వస్తున్న అవినీతి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అక్రమ కట్టడాలు అడ్డుకోవాలి. క్యాతన్ పెల్లి  మున్సిపల్ పరిదిలోని ఒకటో వార్డులో కటిక దుకాణాల సమీపాన ప్రభుత్వ స్థలం కబ్జా చేసి చేపడుతున్న అక్రమ కట్టడాన్ని వెంటనే ఆపేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తక్షణమే మందమర్రి తహశీల్దార్  స్పందించి ప్రభుత్వ అస్థిని కాపాడాలని కోరారు. గతంలో సైతం ఈ విషయం తాహాశీల్దార్ దృష్టికి తీసుకువచ్చానని అయిన పేర్కొన్నారు. స్థానిక అధికారులు స్పందించకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లుతానని హెచ్చరించారు. 

40 సంవత్సరాల నుండి ఖాళీగా ఉంది. 

ఒకటో వార్డులో కటిక దుకాణాల సమీపాన గల ప్రభుత్వ స్థలం 40సంవత్సరాలు గా ఖాళీ స్థలం గా ఉందని ఆ కాలనీ వాసులు ఆవుల రమేష్ పేర్కొన్నారు. బీరెల్లి నర్సయ్య అనే వ్యక్తి భూమిని కబ్జా చేసి థమ్సప్ గోదాం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం పట్ల అధికారులు చర్య తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి కబ్జాడారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.