బాలాపూర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి

Published: Thursday February 18, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; తెలంగాణ ముఖ్యమంత్రి  కెసిఆర్ గారి జన్మదిన  సందర్భంగా మొక్కలు నాటిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ లోని బాలాపూర్ గ్రామంలో ఉన్న జడ్.పి.హెచ్.ఎస్  ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ సీఎం గారి జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేసి. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తో కలిసి కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, పాఠశాల విద్యార్థులతో కెసిఆర్ జన్మదిన సందర్భంగా ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. పాఠశాల యందు నిజీ శోతోకన్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..... పచ్చదనం ప్రగతికి మెట్లు అదేవిధంగా కార్పొరేషన్ ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని వాటికి నీళ్లు పోసి సంరక్షించే బాధ్యత కూడా పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట  మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహా రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎర్ర మహేశ్వరి జైహింద్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామ్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.