కల్లాలు షెడ్లు నిర్మించుకోవాలి : వికారాబాద్ ఎంపీడీఓ మలుగ సత్తయ్య

Published: Saturday January 29, 2022
వికారాబాద్ బ్యూరో 28 జనవరి ప్రజాపాలన : గ్రామంలోని అర్హులైన రైతులు కల్లాలు, షెడ్లు నిర్మించుకోవాలని వికారాబాద్ ఎంపీడీఓ మలుగ సత్తయ్య సూచించారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మోహన్, పంచాయతీ కార్యదర్శి బండ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా 100% వినియోగించుకోవాలని హితవు పలికారు. నర్సరీ, వైకుంఠధామం, సెగ్రిగేషన్ పనులను పర్యవేక్షించారు. క్షేత్ర స్థాయిలో తడి, పొడి చెత్త వేరుచేయడం ప్రతిఒక్కరి భాద్యత అన్నారు. తదనంతరం గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తూ గ్రామస్థులతో స్వచ్ఛ భారత్ పనుల పురోగతిని వాకబు చేశారు. మొత్తం 57 మంది ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్నారని కార్యదర్శి తెలిపారన్నారు. ఉపాధి హామీ కార్యక్రమంలో పొలాలకు సంబంధించిన అన్ని పనులు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఎక్కువ మొత్తంలో ఉపాధి హామీ పనులు చేయడం అభినందనీయమన్నారు. గతంలో కూడా క్యాటిల్ షెడ్ గోట్ షెడ్ లాంటివి చాలా మంది రైతులు నిర్మించుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. కొలతల ప్రకారం పనిచేసి రోజుకు ప్రతి కూలీ 245 రూపాయలు పొందాలని సూచించారు. మొత్తము 15 వేల మొక్కలు పెంచుటకు ఏర్పాటు చేశారని వివరించారు. ఫిల్లింగ్ బ్యాగులలో విత్తనాలు నార్లు వేశారని గుర్తు చేశారు. ప్రైమరీ బెడ్స్ ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. గ్రామంలో ఇన్స్పెక్షన్ యాప్ అప్డేట్ చేశామని స్పష్టం చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపిఓ శ్రీను, పంచాయతీ కార్యదర్శి కిషన్ రెడ్డి, వనసేవక్ రామచంద్రయ్య, గ్రామస్థులు దేవయ్య, వసంత్, రాజ్ కుమార్ మాణయ్య తదితరులు పాల్గొన్నారు.