సీఎం కేసీఆర్ లక్ష 7 వేల ఉద్యోగాలు భర్తీ ఏమైంది?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Tuesday June 15, 2021
జగిత్యాల, జూన్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక లక్ష 7 వేల ఉద్యోగాలు కాలి ఉంటే భర్తీ చేస్తానని  మొదట్లో హామీ ఇచ్చి మోసం చేశారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే నీళ్లు నిధులు నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బిశ్వ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక లక్ష 97 వేల ఉద్యోగాలు కాలి ఉన్నాయని భర్తీ చేయవలన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని బిశ్వ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి నిరుద్యోగ యువతను కేసీఆర్ పచ్చి మోసం చేశారని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని  తెలిపారు. ఉద్యోగుల ఫిట్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా జీత భత్యాన్ని ప్రకటించాల్సిందిపోయి మోసం చేశారని ఆరోపించారు. మంత్రి మాల్లారెడ్డి సమైక్యాంధ్ర నినాదాంతో ముందుకు పోతే దగ్గరికి తీసి మంత్రి పదవి కట్టబెట్టి భూముల ఆక్రమణ చెరువు భూమినీ కబ్జా చేసి కాలేజీ కడితే కేసీఆర్ మందలించే పాపాన పోలేదని మండిపడ్డారు. మంత్రి అజయ్ అక్రమంగా కట్టిన మెడికల్ కాలేజీని పర్మినెంట్ చేయడంలో సీఎం కేసీఆర్ చురుకైన పాత్ర పోషించి మంత్రులను పెంచి పోసిస్తుంన్నారని ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో గిరి నాగభూషణం బండ శంకర్ గాజుల రాజేందర్ కల్లేపల్లి దుర్గయ్య గుంటి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.