ఫిటినెస్ లేని స్కూల్ బస్ లను సీజ్ చేయాలి

Published: Tuesday June 14, 2022

ఎన్.ఎస్.యు.ఐ  జగిత్యాల జిల్లా  అధ్యక్షుడు సదుల వినయ్

కోరుట్ల, జూన్ 13 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని ప్రవైట్ విద్యాసంస్థలో నడుపుతున్న స్కూల్ బస్సులు ఫిటినెస్ లేని వాటిని వెంటనే సీజ్ చేయాలని సోమవారం రోజున ఎస్.యు.ఐ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సదుల వినయ్  కోరుట్ల ఎం.వీ.ఐ వంశీ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సదుల వినయ్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలోని ప్రవైట్ విద్యాసంస్థలో నడుపుతున్న స్కూల్ బస్సు లలో ఫిటినెస్ లేని బస్సులను సీజ్ చేస్తూ, విద్యాసంస్థల  యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎన్.ఎస్.యు.ఐ తరుపున డిమాండ్ చేశారు.