వెదజల్లే పద్ధతిపై క్షేత్ర ప్రదర్శన అధిక లాభాలు ఏవో నారాయణరావు..

Published: Thursday July 21, 2022
వెదజల్లే పద్ధతిపై క్షేత్ర ప్రదర్శన
అధిక లాభాలు ఏవో నారాయణరావు..
 
పాలేరు జూలై 20 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం
చెన్నారం రెవెన్యూ గ్రామ పరిధిలో ఆళ్లగడప. రాఘవులు
రైతు పొలం నందు వరి నేరుగా వెదజల్లే పద్ధతిపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి
ఎస్ వి కే నారాయణరావు పాల్గొని ప్రస్తుతం వరిలో నాటు పద్ధతి బదులు నేరుగా వెదజల్లే పద్దతి ఎంతో మేలని తెలియజేసినారు.
దీనివలన ఈ క్రింది లాభాలు ఉన్నాయని తెలిపినారు. విత్తన మోతాదు 6-8 కిలోలు ఎకరానికి సరిపోతుంది.
2. కూలీల కొరతను అధిగమించి సకాలంలో పంటను విత్తుకోవచ్చు. ఈ పద్ధటి తో సమయం మరియు ఓపెట్టుబడి ఆదా అవుతుంది.
4. ఈ పద్ధతి లో చేసినట్లయితే పంట 10 రోజుల ముందు కోతకు వస్తుంది.
5 . ఈ పద్ధతి లో సాగు చేసినట్లయితే రెండవ పంట సకాలంలో విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో సాగు చేసినట్లయితే  5,000-6,000 రూ
ల వరకు పెట్టుబడి ఆదా చేయవచ్చు.
గత వారంలో కురిసిన అధిక వర్షాలకు సద్వినియోగం చేసుకొని దమ్ము చేసి, నేరుగా వెదజల్లే పద్ధతి లో విత్తుకోవలసిందిగా రైతులకు సూచించినారు.
ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, మండల రైతు బందు కన్వీనర్ శాఖమూరి సతీష్, చిలతనుప్పు. సైదులు, ఓదయ్, రామకష్ణ, అరవింద్, విఖిల, మర్గాభవాని, నసంత ఏఈవోలు,  రైతు ఆళ్లగడప రాఘవులు, పాల్గొన్నారు.
 
 
 
Attachments area