పిల్లల విద్య ఆరోగ్యం పై ప్రత్యక దృష్టి పెట్టాలివసతులు పరిశుభ్రం విషయంలో ఏమాత్రం నాణ్యత లోప

Published: Saturday July 30, 2022
జూలై 29 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారం నాడుమధిర కృష్ణాపురం వద్దగల బీసీ మరియు మైనార్టీ గురుకుల స్కూల్ మరియు కాలేజీలను శుక్రవారం నాడు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  పరిశీలించినారు, హాస్టల్లోని వంటశాల, డైనింగ్ హాల్స్, స్టోర్ రూము, కూరగాయలను నేరుగా పరిశీలించినారు, అనంతరం వంట వండే సిబ్బందితో మాట్లాడుతూ పిల్లలకు భోజనం తయారు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసి తయారు చేయాలని, డైనింగ్ హాల్ వంట పాత్రలు, ప్లేట్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు, అనంతరం ప్రిన్సిపాల్, టీచర్స్, సిబ్బంది తో మాట్లాడుతూ గత సంవత్సరం మంచి ర్యాంకులు సాధించినందుకు ప్రిన్సిపల్ గారిని శాలువతో సత్కరించి అభినందించి ఈ సంవత్సరం కూడా మంచి ఉత్తీర్ణత సాధించేలా పిల్లలను మోటివేషన్ చేయాలి టీచర్స్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమం. టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాస్ ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరావు మార్కెట్ చైర్మన్ నాగేశ్వరరావు నరేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి చావా వేణు ఎంపీపీ లలిత కళాశాల సిబ్బంది ప్రిన్సిపాల్ పాల్గొన్నారు