తక్కువ ధరలకు సిటీ స్కానింగ్ పరిక్షలు

Published: Tuesday May 11, 2021
జగిత్యాల, మే 10 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని పట్టణం మరియు గ్రామాలలో రోజురోజుకు కరోనా విజృంభిస్తూన్న తరుణంలో జగిత్యాల సీట్ స్కానింగ్ సెంటర్లో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువ ధరలకు పరీక్షలు చేయాలని సిటీ స్కానింగ్ యాజమాన్యంతో స్థానిక ఎమ్మెల్యే డా. సంజాయ్ కుమార్ మాట్లాడగా వెంటనే యాజమాన్య బృందం స్పందించి సిటీ స్కానింగ్ టెస్టులను తక్కువ ధరలకే చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చారు. డయాగ్నొస్టిక్ సెంటర్ యాజమాన్యానికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.