డిపో మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన మహేష్

Published: Tuesday April 05, 2022
వికారాబాద్ బ్యూరో 04 ఏప్రిల్ ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వికారాబాద్  డిపో నూతన డిపో మేనేజర్ గా బి.మహేష్ కుమార్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. నూతన డిపో మేనేజర్ కు డిపో ఉద్యోగులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన డిపో మేనేజర్ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ డిపో అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. తదుపరి డిఎం, డివిఎం జ్యోతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛము అందజేశారు. అనంతరం డిఎం, డివిఎం జిల్లా కలెక్టర్ నిఖిలకు పుష్పగుచ్ఛము ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.