మాటూరు హైస్కూలు విద్యార్థులకు బాల్య వివాహాలు, కౌమార వయసు సమస్యలపై అవగాహన కల్పించిన చైల్డ్ ల

Published: Tuesday February 15, 2022
మధిర ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని సోమవారం నాడుమాటూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఖమ్మం చైల్డ్ లైన్ అధికారి శ్రీమతి K ధనలక్ష్మి కౌమారదశలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు వాటి నివారణోపాయాలపై చక్కటి సూచనలు అందించారు. ముఖ్యంగా బాల్య వివాహాలు మీ భవిష్యత్తుకు అవరోధంగా నిలుస్తాయని పేర్కొంటూ అలాంటి సమస్యలు మీకు వచ్చినప్పుడు అధికారులుగా మా దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాల వయసులో అందరూ పాఠశాలలోనే విద్య అభ్యసించాలని బడి మానేసి పనులు పోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమా చార్యులు తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, బానోత్ బావ్ సింగ్, వేము రాములు, పి లక్ష్మి, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.