పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను విడుదల చేయాలి ** టీ,ఎన్,ఎస్,ఎఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి సాయిర

Published: Friday November 04, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 03 (ప్రజాపాలన, ప్రతినిధి) : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రూ 3,500, కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోల్కర్ సాయిరాం, ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు మహేష్, నవీన్ లు డిమాండ్ చేశారు. గురువారం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ ఆదేశాల మేరకు కేరమేరి ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమములు ముందుండి ఉద్యమాన్ని నడిపించిన విద్యార్థులకుఈరోజు వారికి రావలసిన ఫీజుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ విద్యార్థుల ప్రాణాలను సైతం పణంగా పెట్టి, గద్దెనేక్కారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని, లేనిపక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.