మహనీయుల జీవితం ఆదర్శప్రాయం ** కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు **

Published: Thursday April 06, 2023
ఆసిఫాబాద్ జిల్లాఏప్రిల్ 5 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ  ఉప ప్రధాని డా. బాబు జాగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ 116వ  జయంతి వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, ఎస్పి సురేష్ కుమార్, జిల్లా చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే లు  ఆత్రం సక్కు, కోనేరు కోనప్పలతో కలిసి హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ జీవితం  స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయ వేత్త, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన  మహావ్యక్తి అన్నారు. భారత  రాజ్యాంగ సభ సభ్యునిగా,1977 నుండి 1979 వరకు ఉప ప్రధాన మంత్రిగా,పార్లమెంటేరియన్ గా పనిచేశారని,ఆయన చెప్పిన మార్గం ఆచరణ నీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు, ఎం.పి.పి మల్లికార్జున్, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్, వివిధ సంఘాల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.